- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోజులు గడుస్తున్నాయి.. ఇంకా లభించని క్లూ..!
కాకినాడ జిల్లాలో చిన్నారి జాహ్నవి అదృశ్యం కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే జాహ్నవి కనిపించకుండా పోయి రోజులు గడుస్తున్నాయి. ఇంకా ఎలాంటి క్లూ లభించలేదు. ..

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada District)లో చిన్నారి జాహ్నవి(Child Jahnavi) అదృశ్యం కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే జాహ్నవి కనిపించకుండా పోయి రోజులు గడుస్తున్నాయి. ఇంకా ఎలాంటి క్లూ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు చిన్నారిని సురక్షితంగా రక్షించాలని పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
తుని పరిసరాల్లో పోస్టర్లు
చిన్నారి ఆచూకీ కోసం తునితోపాటు పరిసర గ్రామాల్లోనూ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. జాహ్నవి ఫొటోతో కూడిన పోస్టర్లను ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, గోడలపైనా అంటించారు. ప్రతి ఒక్కరికీ తెలిసేలా సోషల్ మీడియా ద్వారానూ సమాచారాన్ని షేర్ చేస్తున్నారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు
చిన్నారి జాహ్నవి కేసును అన్ని కోణాల్లోనూ పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు టీమ్ విచారణ చేపట్టింది. స్థానిక అనుమానితులనూ విచారిస్తోంది. ఆయా ప్రాంతల్లోని సీసీటీవీ ఫుటేజీలను విస్తృతంగా పరిశీలిస్తోంది. జాహ్నవి కుటుంబ సభ్యులతో పాత కక్షలు ఏవైనా ఉన్నాయా లేదా కిడ్నాప్ గ్యాంగ్ పని అయి ఉంటుందా అనే కోణంలోనూ ఆరా తీస్తోంది.
సమాచారం తెలిస్తే వెంటనే ఫోన్ చేయండి
చిన్నారి జాహ్నవి ఆచూకీపై చిన్న సమాచారం ఉన్నా, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కాకినాడ పోలీసులు పిలుపునిచ్చారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని విజ్ఞప్తి చేశారు.






