ప్రమాదకరంగా ఉన్న తాటి చెట్లను తొలగించాలి

by Batti.Sumithra |

రామచంద్రాపూర్ గ్రామంలోని బస్టాండ్ నుంచి హనుమాన్ దేవాలయం వరకు రహదారి పక్కన ప్రమాదకరంగా ఉన్న తాటి చెట్లను తొలగించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.

ప్రమాదకరంగా ఉన్న తాటి చెట్లను తొలగించాలి
X

దిశ, సైదాపూర్ : రామచంద్రాపూర్ గ్రామంలోని బస్టాండ్ నుంచి హనుమాన్ దేవాలయం వరకు రహదారి పక్కన ప్రమాదకరంగా ఉన్న తాటి చెట్లను తొలగించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో కురిసే వర్షాలు, ఈదురు గాలుల కారణంగా తాటి పండ్లు రాలి రహదారిపై పడుతుండటంతో ప్రమాదాలు జరిగే పరిస్థితులు నెలకొంటున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మార్గంలో నిత్యం గ్రామస్తులు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయాందోళన నెలకొంటోందని పేర్కొన్నారు. ప్రస్తుతం గీత కార్మికులు ఈ తాటి చెట్లను వినియోగించకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయని తెలిపారు. ప్రమాదాలకు కారణమవుతున్న ఈ తాటి చెట్లను తొలగించి, ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.

Next Story