- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూట్యూబర్ రావణ్‌పై UAPA చట్టం.. జగన్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. చంద్రబాబు దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. చంద్రబాబు దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. రాజకీయ అణచివేత చర్యలకోసం, ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణివైపు నడిపిస్తున్నారని విమర్శించారు. బాబు పాలనలో పుట్టుకొచ్చిన దుష్టసంప్రదాయాలతో మీరు రాష్ట్రంలో ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారని పేర్కొన్నారు. అవి క్రమంగా మొక్కలై విషవృక్షాలుగా మారుతున్నాయని విమర్శించారు. చిన్నారులు మిస్సింగ్ అయినా దర్యాప్తుపై వేగం లేదని, మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదు కాకపోయినా కదలిక లేదన్నారు. గిరిజన మహిళను వివస్త్రచేసి, దాడి చేసినా అరెస్టులు లేవని.. కానీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్‌బెయిలబుల్ సెక్షన్లు పెడతారా? అంటూ ప్రశ్నించారు.
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటిపోయినా ఇప్పటికీ ఆ పాప ఆచూకీ లేదన్నారు. తన కూతురు ఫొటోలు పట్టుకుని ఆ తండ్రి వీధివీధి తిరుగుతున్నాడని, పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైందని తెలిపారు. ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడంలోనే ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలుగుతారు? అని ప్రశ్నించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై వాటికి సంబంధించిన సెక్షన్లతో కాకుండా, బెయిల్ రాని సెక్షన్లు పెట్టాలని, కేసులను వ్యవస్థీకృత నేరాలకు లింక్ చేయాలంటూ ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ మాదిరిగా మీరే, ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఈ ఆదేశాలు చేరేలా, పోలీసులకు హుకుం జారీ చేసినట్లుగా సమాచారం వస్తోందని ఆరోపించారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి అని, ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, భయపెట్టాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుందని విమర్శించారు.
యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్, ఉస్మానియా గోల్డ్‌మెడల్ జర్నలిస్ట్ కేవీఆర్‌ను సరైన చట్ట ప్రక్రియలు పాటించకుండా హైదరాబాద్ నుంచి భారీ పోలీసు బలగాలతో తీసుకురావడం, అతను చేయని వాటిని చేసినట్టుగా ఎఫ్‌ఐఆర్‌లో పెట్టి, జైలుకు పంపడం అత్యంత దుర్మార్గం అని పేర్కొన్నారు. యూట్యూబర్ రావణ్ విషయంలో పెట్టిన కేసులకు, నాలుగు కోర్టుల్లో బెయిల్స్ వచ్చినా, అహంకారంతో చెలరేగిపోతూ, నేరుగా సంబంధిత పోలీస్‌స్టేషన్లపై తమ వారి చేత దాడులు చేయించారని మండిపడ్డారు. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారని పేర్కొన్నారు. మీరు గతంలో, ఇప్పుడుకూడా ఏ మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో వాళ్లుకూడా అవే మాటలు మాట్లాడుతున్నారు, వాటినే ప్రశ్నిస్తున్నారని అన్నారు. అలాంటప్పుడు మరి అవే అభియోగాలు మీ మీదకూడా పెట్టాలికదా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది రౌడీ పోలీస్ రాజ్యం.. జంగిల్‌రాజ్ కాదన్నారు. ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలని, బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలని పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం కావాలన్నారు. రాజకీయ ఆదేశాలకు కాకుండా, రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీస్ వ్యవస్థ కావాలని తెలిపారు.






