- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూట్యూబర్ రావణ్ రాసలీలల వీడియో.. స్పందించిన భార్య
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో యూట్యూబర్ రావణ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని మీడియా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ రావణ్ కులం ఇది, గతంలో అమ్మాయిలను వేధించేవాడు, రాసలీలల వీడియో అంటూ ప్రచారం చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో యూట్యూబర్ రావణ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని మీడియా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ రావణ్ కులం ఇది, గతంలో అమ్మాయిలను వేధించేవాడు, రాసలీలల వీడియో అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం పై రావణ్ భార్య అనూష స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తన భర్తపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు. తమ తప్పు సమర్థించుకునేందుకే కల్పిత వీడియో క్రియేట్ చేశారని ఆరోపించారు. కులమతాల మధ్య విద్వేశాలు రెచ్చగొట్టడంపై తమ కుటుంబం వ్యతిరేకం అని అన్నారు.
తన భర్త కులాన్ని వక్రీకరిస్తున్నారని, తన భర్తది కమ్మ కులం అని చెప్పారు. ప్రజలకు నిజాలు తెలియాలి కాబట్టే ఈ విషయం చెబుతున్నానని పేర్కొన్నారు. తమకు ఏ పార్టీతో సంబంధాలు లేవని, గొంతులేని వర్గాలకు గొంతుకై నిలవడమే రావణ్ పార్టీ అని చెప్పారు. సమాజంలో శాంతి, రాజ్యాంగం ప్రకారమే ప్రజలు నడుచుకోవాలనేది రావణ్ సిద్ధంతం అని తెలిపారు. ప్రశ్నించడం రావణ్ నైజమని, ప్రజాస్వామ్య వాదిగానే ప్రశ్నిస్తాడని అన్నారు. ప్రశ్నలకు సమాధానం ఉంటే చెప్పాలి లేదంటే లోపాలు సరిదిద్దుకోవాలి కానీ ఇలా నడుచుకోవడం చట్ట వ్యతిరేకం అని పేర్కొన్నారు. కోర్టుల పట్ల, వ్యవస్థల పట్ల తమ కుటుంబానికి నమ్మకం ఉందని, ప్రజలు ఎవరూ అసత్య ప్రచారాలు నమ్మవద్దని కోరారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టారని అంతవరకు ఓకే కానీ అసభ్యకర వీడియోలు క్రియేట్ చేసి ప్రచారం చేయడం ఏంటి అని ఆవేదన వ్యక్తం చేశారు.






