వ్యాధుల్ని ట్రాక్ చేసే వేరబుల్ సెన్సార్లు.. పార్కిన్సర్ చికిత్సలో కీ రోల్!

by Javid Pasha |   (  Updated:2026-07-05 13:46:30  IST  )

వేరబుల్ సెన్సార్లు పార్కిన్సన్ వ్యాధిని ట్రాక్ చేసి, సమాచారం అందిస్తాయి. బాధితుల్లో వాకింగ్, నాన్ వాకింగ్ వంటి యాక్టివిటీస్‌ని కొలుస్తాయి.

వ్యాధుల్ని ట్రాక్ చేసే వేరబుల్ సెన్సార్లు.. పార్కిన్సర్ చికిత్సలో కీ రోల్!
X

దిశ, ఫీచర్స్ : మోడర్న్ టెక్నాలజీ అద్భుతాలు చేస్తోంది. ప్రతీ రంగంలో ఏదో ఒక రూపంలో ఉపయోగ పడుతోంది. అలాంటి వాటిలో మెడికల్ టెక్నాలజీ కూడా ఒకటి. వివిధ పరికరాలుగా, యంత్రాలుగా అందుబాటులోరి వస్తూ.. వ్యాధులను లేదా వ్యాధి బాధితుల యాక్టివిటీస్‌ని ట్రాక్ చేయడంలో, అలర్ట్ చేయడంలో ఇది సహాయపడుతున్నదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పార్కిన్సన్ పురోగతిని ట్రాక్ చేయడంలో సహాయపడే వేరబుల్ సెన్సార్లు(wearable sensors) ఇటీవల విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయని పేర్కొంటున్నారు. నిజానికి ఈ టెక్నాలజీని హో-కింగ్ చాంగ్ (Ho King Chung) అనే శాస్త్రవేత్త తన సహచర బృందంతో కలిసి డెవలప్ చేశాడు. ప్రస్తుతం ఏవిధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

రోజువారీ జీవితంలో ఉపయోగం..

సాంకేతిక శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన వేరబుల్ సెన్సార్లు పార్కిన్సన్ వ్యాధిని ట్రాక్ చేసి, సమాచారం అందిస్తాయి. అధ్యయనాల ప్రకారం ఇవి వ్యాధి ప్రారంభ దశలో ఉన్న రోగుల్లో వాకింగ్, నాన్ వాకింగ్ వంటి యాక్టివిటీస్‌ని కచ్చితంగా కొలుస్తాయి. అంతేకాకుండా కొత్త సెన్సార్లు రోజువారీ జీవితంలోని డేటాను సేకరించి గైట్(నడక వేగం, స్టెప్ లెంగ్త్ , షఫ్లింగ్), సెడెంటరీనెస్ (కూర్చోవడం, నిలబడటం వంటి నిశ్చల సమయం) మార్పులను గుర్తిస్తాయి. ఇవి వ్యాధి ఎలా పురోగమిస్తున్నదో అబ్జెక్టివ్‌గా అర్థం చేసుకోవడానికి సహాయపడతుందని నిపుణులు అంటున్నారు.

రియల్ డేటాతో సహాయం

వేరబుల్ సెన్సార్లు లేదా పరికరాలు రోగుల రియల్-వరల్డ్ డేటాను సేకరించడం ద్వారా ట్రెడిషనల్ క్లినికల్ అసెస్‌మెంట్‌ల కంటే ఎక్కువ కచ్చితమైన, సమగ్రమైన అవగాహనను అందిస్తాయని నిపుణులు అంటున్నారు. నడక సమయంలో ఏర్పడే మార్పుల(Gait impairment)తో పాటు, నడకేతర సమయంలోని, అంటే ఎక్కువ నిశ్చలత, తగ్గిన ఫిజికల్ యాక్టివిటీస్ వంటి మార్పులను కూడా మెరుగ్గా మానిటర్ చేయడానికి, చికిత్సల ప్రభావాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడతాయి. మొత్తమ్మీద ఈ సాంకేతికత పార్కిన్సన్ రోగుల జీవన నాణ్యతను మెరుగు‌పరచడంలో ముఖ్యపాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

Next Story