సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 3వ తరగతి చిన్నారి ‘కేసీఆర్’ ఆర్ట్!

by Kodari Anjali |

ఓ చిన్నారి వేసిన కేసీఆర్ ఆర్ట్ సోషల్ మీడియాలోని జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 3వ తరగతి చిన్నారి ‘కేసీఆర్’ ఆర్ట్!
X

దిశ, అలంపూర్: గద్వాల జిల్లా మానవపాడు మండలం అమరవాయి గ్రామానికి చెందిన నబి కూతురు ఎండీ అల్ఫియా ప్రస్తుతం హైదరాబాద్‌లో మూడో తరగతి చదువుతోంది. చిన్నప్పటి నుంచే డ్రాయింగ్‌పై మక్కువ పెంచుకున్న ఈ చిన్నారి, టీవీలు, పేపర్లలో కేసీఆర్ తాతను పదే పదే చూస్తూ ఆయన చిత్రాన్ని గీయాలని నిర్ణయించుకుంది. తన సొంత చేతులతో అద్భుతంగా కేసీఆర్ ఆర్ట్‌ను వేసింది. అల్ఫియా గీసిన ఈ కేసీఆర్ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చిన్నారి ప్రతిభను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

Next Story