' మహిళల పై పెరుగుతున్న హింస, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఉద్యమించాలి '

by Batti.Sumithra |

మహిళల పై పెరుగుతున్న హింస, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతామని ప్రగతిశీల మహిళా సంఘం (పి.ఓ.డబ్ల్యూ.) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కే. జ్యోతి అన్నారు.

 మహిళల పై పెరుగుతున్న హింస, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఉద్యమించాలి
X

దిశ, గోదావరిఖని : మహిళల పై పెరుగుతున్న హింస, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతామని ప్రగతిశీల మహిళా సంఘం (పి.ఓ.డబ్ల్యూ.) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కే. జ్యోతి అన్నారు. ఆదివారం ఎన్టీపీసీ ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో నిర్వహించిన పి.ఓ.డబ్ల్యూ నిర్మాణ జనరల్ బాడీ సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళల పై హింస, అత్యాచారాలు, హత్యలు, గృహహింస, లైంగిక వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనలను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.

పాలకవర్గ పార్టీలన్నీ ఒకరిపై ఒకరు కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతూ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయని, ఓట్లు, సీట్ల పై చూపుతున్న శ్రద్ధను మహిళల భద్రతపై చూపకపోవడం బాధాకరమని అన్నారు. అంతేకాకుండా మహిళా కార్మికులు పనిప్రదేశాల్లో అనేక రకాల వేధింపులు, అవమానాలకు గురవుతున్నారని తెలిపారు. మహిళల భద్రతకు సంబంధించి సమగ్ర చట్టాలను తీసుకురావాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. మహిళల పై నేరాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షులు చిలక శంకర్, జిల్లా నాయకులు పి. స్వామి, బి. కొమురయ్య, డి. రవి, ఆర్. రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.

Next Story