- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ నెల 25న ఢిల్లీలో కేంద్రానికి వ్యతిరేకంగా భారీ ధర్నా: మహిళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబా
కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ మహిళా వ్యతిరేక సర్కార్ అని, ఈ నెల 25న డిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ధర్నా చేయనున్నట్లుగా మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబా తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ మహిళా వ్యతిరేక సర్కార్ అని, ఈ నెల 25న డిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ధర్నా చేయనున్నట్లుగా మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబా తెలిపారు. నారిశక్తి వందన్ 33% రిజర్వేషన్ బిల్లు తక్షణమే అమలు చెయ్యాలని, మహిళ రిజర్వేషన్ బిల్లులో ఓబీసీలకు అవకాశం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆదివారం గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అల్కా లాంబా తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్యే, నేతలు చిన్న పిల్లలపై హత్యాచారం చేస్తున్నారని, పేపర్ లీక్ చేసి విద్యార్థులు జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు మండిపడ్డారు. కేంద్ర విద్య మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విఫలం అయ్యారని, ఆపరేషన్ సింధూర్ పై రాజ్ నాథ్ సింగ్ పార్లమెంట్లో అబద్ధాలు ఆడారు, అయోధ్య రామమందిరంలో దొంగతనం జరిగితే ఎందుకు ప్రధాని మాట్లాడటం లేదని అల్కా లాంబా నిలదీశారు. అక్కడ ఉన్న నేతలు ఆర్ఎస్ఎస్ వాళ్లు కాదా? బీజేపీ సర్కార్ ఓటు చోర్, చందా చోర్ సర్కార్ అని ఆమె ఆరోపించారు.
20 జూలై నుండి ఆగస్టు వరకు దేశవ్యాప్తంగా పోరాటం చేయనున్నామని, తెలంగాణ మహిళ కాంగ్రెస్ కేంద్రంపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రధానికి పోస్ట్ కార్డ్ ద్వారా ఉద్యమం చేపట్టామన్నారు. నిరసన తెలియచేస్తూ 9133400200 మిస్ కాల్ ఉద్యమం కూడ చేపట్టామని, బీజేపీ ప్రభుత్వాన్ని న్యాయమూర్తులు వ్యతిరేకిస్తున్నారని అల్కా లాంబా విమర్శించారు. 3 నెలల నుండి 19 జిల్లాలలో సమావేశాలు నిర్వహించామని, రాష్ట్ర ప్రభుత్వ పాలన పట్ల మహిళలు సంతోషంగా ఉన్నారని ఆమె తెలిపారు. మహిళ సాధికారత కోసం కృషి చేస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలని, 1,16వేలకు పైగా మహిళా నేతల సభ్యత్వాలు నమోదు అయ్యాయని, సెప్టెంబర్ నెలలలో రెండు రోజుల శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని అల్కా లాంబా చెప్పారు.






