- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లారీ–బైక్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
by Ratna Kumari |
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలంలో లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

X
దిశ, హుజూర్‌నగర్ టౌన్ : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలంలో లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. హుజూర్‌నగర్ ఎస్సై చలిగంటి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెరువు మండలం కందిబండ గ్రామానికి చెందిన ముల్లంగి నరసింహారావు ద్విచక్ర వాహనంపై హుజూర్‌నగర్ నుంచి కందిబండకు వెళుతుండగా, హుజూర్‌నగర్ పట్టణ శివారులోని నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ లారీ కార్యాలయం సమీపంలో మేళ్లచెరువు వైపు నుంచి వస్తున్న లారీతో ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో నరసింహారావుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Next Story






