- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి ఘనంగా
సత్తుపల్లి మండల అధ్యక్షుడు సాలి శివకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం పాకలగూడెం పోలింగ్ బూత్ పరిధిలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

దిశ, సత్తుపల్లి : భారతీయ జనతా పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆదేశాల మేరకు సత్తుపల్లి మండల అధ్యక్షుడు సాలి శివకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం పాకలగూడెం పోలింగ్ బూత్ పరిధిలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు మాట్లాడుతూ.. దేశ సమైక్యత, జాతీయవాద భావజాలం కోసం డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి కార్యకర్త ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. "ఒక్కో కార్యకర్త – ఒక్కో మొక్క" లక్ష్యంతో భవిష్యత్ తరాలకు పచ్చని ప్రకృతిని అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వేముల లక్ష్మీనారాయణ, బూత్ అధ్యక్షుడు ఎస్‌కే సుభాని, జిల్లా సీనియర్ నాయకుడు భాస్కరరావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు పాల్గొని మొక్కలు నాటి వాటికి నీరు పోసి సంరక్షణ బాధ్యతలు స్వీకరించారు.






