ఓటు హక్కు పరిరక్షణ కోసం ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో పాల్గొనాలి : సాయిజెన్ శేఖర్

by Batti.Sumithra |

నాచారం హెచ్‌ఎంటీ నగర్ డివిజన్‌లో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు సాయిజెన్ శేఖర్ ఆదివారం పరిశీలించారు.

ఓటు హక్కు పరిరక్షణ కోసం ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో పాల్గొనాలి : సాయిజెన్ శేఖర్
X

దిశ, నాచారం : నాచారం హెచ్‌ఎంటీ నగర్ డివిజన్‌లో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు సాయిజెన్ శేఖర్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌ఓలు) నిర్వహిస్తున్న ఓటర్ల వివరాల నమోదు, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను పరిశీలించి స్థానిక ఓటర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా సాయిజెన్ శేఖర్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతిపౌరుడికి కల్పించిన అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు ఓటు హక్కు అని పేర్కొన్నారు.

శ్రీ రాఘవేంద్ర నగర్‌లోని కాంక్రీట్ పలాజో అపార్ట్‌మెంట్‌లో బీఎల్‌ఓలు ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్న సందర్భంగా, ఓటర్ల జాబితాలో ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల పేర్లు రెండు, మూడు వేర్వేరు బూత్‌ల పరిధిలో నమోదై ఉండటంతో, సంబంధిత బీఎల్‌ఓ తన పరిధిలోని ఓటర్లకు మాత్రమే ఫారాలు అందజేయడంతో మిగిలిన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు. అదేవిధంగా, పలుచోట్ల ఓటర్ల చిరునామాలను గుర్తించడంలో బీఎల్‌ఓలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యలను సంబంధిత ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లి, అర్హులైన ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు విట్టల్ యాదవ్, కట్ట బుచ్చన్న గౌడ్, అశోక్‌తో పాటు కాంక్రీట్ పలాజో అపార్ట్‌మెంట్ నివాసితులు, స్థానికులు పాల్గొన్నారు.

Next Story