ఈదురు గాలులకు విద్యుత్ స్థంభం కూలి విషాదం

by Ratna Kumari |

మండలంలోని బోయగూడెం గ్రామ శివారులో ఆదివారం బలమైన ఈదురు గాలుల కారణంగా విద్యుత్ స్థంభం కూలిపోవడంతో విద్యుత్ వైర్లు తెగిపడి పొలాల్లో పడిన ఘటన విషాదానికి దారితీసింది.

ఈదురు గాలులకు విద్యుత్ స్థంభం కూలి విషాదం
X

దిశ, తిరుమలగిరి (సాగర్) : మండలంలోని బోయగూడెం గ్రామ శివారులో ఆదివారం బలమైన ఈదురు గాలుల కారణంగా విద్యుత్ స్థంభం కూలిపోవడంతో విద్యుత్ వైర్లు తెగిపడి పొలాల్లో పడిన ఘటన విషాదానికి దారితీసింది. ప్రతిరోజూ మేతకు వెళ్లే పశువులు ప్రమాదవశాత్తు తెగిపడిన విద్యుత్ వైర్లను తాకడంతో భాషం శ్రీనివాస్‌కు చెందిన రెండు పాడి గేదెలు, నెమలి వెంకట్‌రెడ్డికి చెందిన మరో పాడి గేదె అక్కడికక్కడే మృతి చెందాయి. అదే ప్రమాదంలో ఒక కుక్క కూడా విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో పాడి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన మూడు పాడి గేదెల విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని, వాటిపైనే తమ కుటుంబ జీవనోపాధి ఆధారపడి ఉందని బాధితులు వాపోయారు.ఘటనపై స్పందించిన బాధితులు, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి, బాధిత రైతులకు తగిన పరిహారం అందించి న్యాయం చేయాలని కోరారు.

Next Story