విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్థన్’లో బాలీవుడ్ హాట్ బ్యూటీ.. ఈసారైనా లక్ కలిసొచ్చేనా?

by Mallepaka Hamsa |

ఈ స్పెషల్ సాంగ్ కోసం మొదట ప్రీతి ముకుందన్ పేరు వినిపించినప్పటికీ, ఫైనల్‌గా బాలీవుడ్ నటి అనన్య పాండేను ఓకే చేసినట్లు తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్థన్’లో బాలీవుడ్ హాట్ బ్యూటీ.. ఈసారైనా లక్ కలిసొచ్చేనా?
X

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకతత్వంలో తెరకెక్కుతున్న ‘రణబాలి’షూటింగ్‌లో పాల్గొంటున్నారు. రాయలసీ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. దీంతో పాటు విజయ్ దేవరకొండ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్థన చేస్తున్నారు. ఈ యాక్షన్‌లో మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ‘రౌడీ జనార్థన’ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మాస్ యాక్షన్ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని, అందుకోసం చిత్ర బృందం బాలీవుడ్ హాట్ బ్యూటీని రంగంలోకి దించుతోందని టాక్.

ఈ స్పెషల్ సాంగ్ కోసం మొదట ప్రీతి ముకుందన్ పేరు వినిపించినప్పటికీ, ఫైనల్‌గా బాలీవుడ్ నటి అనన్య పాండేను ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు విజయ్, అనన్య కాంబినేషన్‌లో వచ్చిన ‘లైగర్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద డిజాస్టర్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా దెబ్బకు విజయ్, అనన్య ఇద్దరూ చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. దీని తర్వాత అనన్య పాండే తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌కు చెక్కేశారు. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ‘రౌడీ జనార్థన’ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం విజయ్ దేవరకొండ పక్కన అనన్య పాండే జతకట్టబోతుండటంతో.. ఈసారైనా లక్ కలిసి వచ్చి అనన్య ఖాతాలో ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడుతుందా లేదా అని నెటిజన్లు అనుమానాలు, ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.

Next Story