- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకే దాబాలో మద్యం సేవిస్తూ…
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలోని అబ్బారెడ్డిగూడెం క్రాస్‌రోడ్డులో ఉన్న ఓ దాబాలో ఆదివారం ఒకే రాజకీయ పార్టీకి చెందిన రెండు వర్గాల కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది.

దిశ, గరిడేపల్లి : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలోని అబ్బారెడ్డిగూడెం క్రాస్‌రోడ్డులో ఉన్న ఓ దాబాలో ఆదివారం ఒకే రాజకీయ పార్టీకి చెందిన రెండు వర్గాల కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. స్థానికుల కథనం ప్రకారం, మండలంలోని పొనుగోడు గ్రామానికి చెందిన ఒక వర్గం కార్యకర్తలు దాబాకు మద్యం సేవించేందుకు వెళ్లారు. అదే సమయంలో అదే గ్రామానికి చెందిన మరో వర్గం కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మద్దతుదారుల మధ్య చిన్నపాటి మాటామాటా చోటుచేసుకోగా, అది క్షణాల్లోనే తీవ్రరూపం దాల్చి పరస్పరం తోపులాటకు దారితీసినట్లు సమాచారం.
ఘర్షణను అడ్డుకునేందుకు అక్కడే ఉన్న ఇద్దరు స్థానిక నాయకులు పలుమార్లు జోక్యం చేసుకుని శాంతించాలని సూచించినప్పటికీ, మద్దతుదారులు వారి మాటలను పట్టించుకోకుండా వాగ్వాదాన్ని కొనసాగించినట్లు తెలిసింది. ఈ ఘటనలో కొందరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనలో విశేషమేమిటంటే, గొడవను ఆపేందుకు ప్రయత్నించిన నాయకులతో పాటు ఘర్షణకు దిగిన ఇరు వర్గాల మద్దతుదారులు కూడా ఒకే రాజకీయ పార్టీకి చెందిన వారే కావడం. సొంత పార్టీ కార్యకర్తల మధ్య బహిరంగంగా ఘర్షణ చోటుచేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘర్షణకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.






