- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆసక్తిని రేకెత్తిస్తోన్న ‘GDN నాయుడు’ సినిమా ట్రైలర్
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచేసి వరుస అప్‌డేట్స్ ఇస్తోంది. ఇందులో భాగంగా తాజాగా సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసి అంచనాలను పెంచేశారు.

దిశ, సినిమా: ఆర్ మాధవన్ ప్రతిష్టాత్మక బయోపిక్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. భారతదేశపు గొప్ప అవిష్కర్త, ఇంజనీర్ అయిన జిడి నాయుడు బయోపిక్‌లో మాధవన్ నటిస్తున్నారు. ‘జిడిఎన్’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మాధవన్‌తో పాటు సత్యరాజ్, జయరామ్, ప్రియమణి, దుషారా విజయన్, వినయ్ రాయ్, తంబి రామయ్య కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రాన్ని వర్గీస్ మూలన్ పిక్చర్స్ సంస్థతో కలిసి మాధవన్ తన సొంత బ్యానర్ అయిన ట్రైకలర్స్ ఫిల్మ్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 17న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచేసి వరుస అప్‌డేట్స్ ఇస్తోంది. ఇందులో భాగంగా తాజాగా సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసి అంచనాలను పెంచేశారు.
ట్రైలర్ చూస్తుంటే సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో అర్థమవుతోంది. బ్రిటిష్ ఇండియా కాలంలో సాగే పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా రాబోతోంది. మన దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటారును తయారు చేసిన జి.డి. నాయుడు.. తన కొత్త ఆవిష్కరణలతో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా చేసిన పోరాటాల చుట్టూ ఈ కథ సాగుతుందని ట్రైలర్ బట్టి తెలుస్తోంది. ఇక ఈ ట్రైలర్‌లో మాధవన్ యువకుడిగా, అలాగే వయసు పైబడిన వృద్ధుడిగా రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశారు. తన పర్ఫార్మెన్స్‌తో కట్టిపడేశారు. ముఖ్యంగా ‘బ్రిటిషర్లు భయపడ్డారు.. సొంత దేశస్థులు మర్చిపోయారు’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ ట్రైలర్ సినిమాపై విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.






