విషాదం... తండ్రి, కుమార్తెల ఆత్మహత్య

by Vemula.Srinu Prasad |

తండ్రి కుమార్తెలు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన ఆదివారం అలవాల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన పోతులూరయ్య (75) భార్య, కొడుకు కొన్ని ఏళ్ల క్రితం మృతి చెందారు....

విషాదం... తండ్రి, కుమార్తెల ఆత్మహత్య
X

దిశ, నరసరావుపేట: తండ్రి కుమార్తెలు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన ఆదివారం అలవాల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన పోతులూరయ్య (75) భార్య, కొడుకు కొన్ని ఏళ్ల క్రితం మృతి చెందారు. దీంతో ఆయన తన కుమార్తె రామాంజమ్మ (50)తో కలిసి జీవిస్తున్నారు. పోతులూరయ్య భార్య, కుమారుడు మృతి అనంతరం ఆయన తీవ్ర మనోవేదనకు గురై మానసికంగా కుంగి పోయారు. దీనికి తోడు కుటుంబ కలహాల వల్ల ఆయనకు జీవితంపై విరక్తి కలిగింది. అదే విధంగా వయో భారంతో ఏమి చేయలేని స్థితిలో తనను ఎవరూ చూడరని నిర్ణయించుకుని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో తట్టుకోలేక కుమార్తె కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.

Next Story