- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జోసెఫ్ విషయంలో.. ప్రభుత్వంపై CPI కీలక వ్యాఖ్యలు
UAPA చట్టాన్ని దుర్వినియోగం చేయొద్దని సీపీఐ రామకృష్ణ అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బచ్చలకూర జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌ను పోలీసులు ఐదోసారి కూడా అరెస్ట్ చేసి ఈ సారి UAPA చట్టం ప్రకారం నమోదు చేసిన విషయం తెలిసిందే..

దిశ, వెబ్ డెస్క్: UAPA చట్టాన్ని దుర్వినియోగం చేయొద్దని సీపీఐ రామకృష్ణ(CPI Ramakrishna) అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బచ్చలకూర జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్(Bachalakura Joseph Alias Prashna Ravana)ను పోలీసులు ఐదోసారి కూడా అరెస్ట్ చేసి ఈ సారి UAPA చట్టం ప్రకారం నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ చట్టం ప్రకారం కేసు పెట్టడాన్ని సీపీఐ రామకృష్ణ ఖండించారు. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవాలని సూచించారు. UAPA చట్టం దేశద్రోహులకు మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. ప్రభుత్వానికి పోలీసులు తొత్తుల్లా మారారని విమర్శించారు. బెయిల్ వచ్చినా మరో కేసు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. జైలుకు పంపేందుకే ఈ చట్టం ప్రకారం కేసు పెట్టారని సీపీఐ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.






