- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేలు జాతి పశు సంతతిని మెరుగుపరచడమే లక్ష్యం
షాద్‌నగర్ నియోజకవర్గంలోని గడ్డకట్టిన వీర్యం ఉత్పత్తి కేంద్రం ను రూ.21 కోట్ల అదనపు నిధులతో పూర్తి చేసి త్వరలోనే పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురానున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.

దిశ, షాద్ నగర్: ఎన్నో ఏళ్లుగా అసంపూర్తిగా, నిరుపయోగంగా మారిన షాద్‌నగర్ నియోజకవర్గంలోని గడ్డకట్టిన వీర్యం ఉత్పత్తి కేంద్రం ( ప్రొజెన్ సెవెన్ బుల్ స్టేషన్) ను రూ.21 కోట్ల అదనపు నిధులతో పూర్తి చేసి త్వరలోనే పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య, క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కంసాన్పల్లి గ్రామంలోని ప్రొజెన్ సెవెన్ బుల్ స్టేషన్ ను షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సెమెన్ బుల్ స్టేషన్ ను పరిశీలించి పశువర్ధక శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరీంనగర్ తర్వాత రెండో సెమెన్ బుల్ స్టేషన్ షాద్ నగర్ నియోజకవర్గంలోనే ఉందని పేర్కొన్నారు. గతంలో సెవెన్ బుల్ స్టేషన్ నిర్మాణం ప్రారంభమైనప్పటికీ నిధులు, సిబ్బంది కొరతతో పనులు నిలిచిపోయాయని తెలిపారు. ఇప్పుడు రూ.21 కోట్ల నిధులు మంజూరు చేసి అవసరమైన సిబ్బందిని నియమించి ఈ కేంద్రాన్ని అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. దీనివల్ల రాష్ట్రంలో మేలు జాతి పశు మెరుగుపడుతూ పాటు పాల, మాంస ఉత్పత్తుల రంగానికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కేంద్రం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రతి ఏడాది సుమారు 10 లక్షల మేలు జాతి పశువుల వీర్య మోతాదులు (సీమెన్ డోసులు) ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుందని, దీంతో రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెరగడంతో పాటు రైతుల ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు.
రూ.21 కోట్లతో ప్రొజెన్ సెవెన్ బుల్ స్టేషన్‌కు పునర్జీవం
ప్రస్తుతం తెలంగాణలో పాల, మాంసం వినియోగం అధికంగా ఉన్నప్పటికీ ఉత్పత్తి తక్కువగా ఉందని, ఈ కేంద్రం ప్రారంభమైతే ఆ పరిస్థితిలో మార్పు వస్తుందని వివరించారు. పనులు వేగంగా పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ పలుమార్లు అసెంబ్లీలో సెమన్ బుల్ స్టేషన్ గురించి ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేయడంతో పాటు అవసరమైన పరిపాలనా అనుమతులు లభించాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ గోపి, అదనపు సంచాలకులు డాక్టర్ సుబ్బారాయుడు, పశుగణాభివృద్ధి శాఖ కార్యనిర్వహణాధికారి, పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ సింగం చరణ్ కౌశిక్ యాదవ్, పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ జ్ఞానప్రకాశ్, కంసాన్‌పల్లి సర్పంచ్ గీత, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, జిల్లా పశు వైద్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్, సహాయ సంచాలకులు డాక్టర్ శ్రవణ్ కుమార్, ఈవో డాక్టర్ అరుణశ్రీ, స్థానిక సహాయ సంచాలకులు డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, ఆర్డీవో ఎన్.ఆర్. సరిత, ఎమ్మార్వో నాగయ్య, స్థానిక నాయకుడు నరేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందే మోహన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీలు శివశంకర్ గౌడ్, ఇద్రీస్, స్థానిక పశువైద్యులు, గోపాలమిత్ర సూపర్వైజర్లు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.






