ఘనంగా అండర్ 11 మిని బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2026 ప్రారంభం

by Kodari Anjali |

యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఉపాధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా పిలుపునిచ్చారు .

ఘనంగా అండర్ 11 మిని బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2026 ప్రారంభం
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఉపాధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం నాచారంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే అండర్ 11 జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2026 పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. బ్యాడ్మింటన్ వంటి క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి శ్రీధర్ బాబు , ప్రధాన కార్యదర్శి పుల్లెల గోపీచంద్‌తో కలిసి తాను గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఈవెంట్స్ ఇంఛార్జి బాబు, వికారాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కోశాధికారి కుమార్ మంచిర్యాల బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి మధు, మేడ్చల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ జాయింట్ కార్యదర్శి రమేశ్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కోశాధికారి హర్ష, ఎగ్జిక్యూటివ్ మెంబర్ సీతల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story