గోదావరికి కొత్త నీరు

by Ratna Kumari |

మొన్నటివరకు ఇసుక దిబ్బలతో దర్శనమిచ్చిన గోదావరి నది తాజాగా కొత్త వరద నీటితో కళకళలాడుతోంది.

గోదావరికి కొత్త నీరు
X

దిశ, భద్రాచలం : మొన్నటివరకు ఇసుక దిబ్బలతో దర్శనమిచ్చిన గోదావరి నది తాజాగా కొత్త వరద నీటితో కళకళలాడుతోంది. భద్రాచలం పుణ్యక్షేత్రంలోని గోదావరిలో నీటి ప్రవాహం పెరగడంతో పవిత్ర స్నానాల కోసం వచ్చిన భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి భారీగా వరదనీరు చేరుతోంది. ఎగువనున్న లక్ష్మీ బ్యారేజ్ నుంచి 85 గేట్లు ఎత్తి 90,580 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో గోదావరిలో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. శనివారం ఉదయం 4.30 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం ఆదివారం ఉదయం 8 గంటల నాటికి 6.70 అడుగులకు పెరిగింది.

Next Story