పొతంశెట్టిపల్లిలో ఆటో బైక్ ఢీ.. ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలు

by Taduka Kalyani |

పోతంశెట్టిపల్లి హెచ్ పి పెట్రోల్ పంపు సమీపంలో ఆటో బైక్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

పొతంశెట్టిపల్లిలో ఆటో బైక్ ఢీ.. ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలు
X

దిశ, కొల్చారం : పోతంశెట్టిపల్లి హెచ్ పి పెట్రోల్ పంపు సమీపంలో ఆటో బైక్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పోతంశెట్టిపల్లి గ్రామంలో నుంచి వేగంగా మెదక్- హైదరాబాద్ జాతీయ రహదారిపైకి దూసుకు వచ్చిన మోటార్ సైకిల్ ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న మెదక్ కు చెందిన నాగరాజు పటాన్చెరుకు చెందిన సాయి లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే 108 అంబులెన్స్‌ సాయంతో చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Next Story