అమీన్ పూర్ లో పలు కాలనీల్లో పర్యటించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

by Taduka Kalyani |

అమీన్పూర్ డివిజన్ లలో ఎక్కడ ఏ సమస్యలు తలెత్తినా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు.

అమీన్ పూర్ లో పలు కాలనీల్లో పర్యటించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
X

దిశ, అమీన్ పూర్: అమీన్పూర్ డివిజన్ లలో ఎక్కడ ఏ సమస్యలు తలెత్తినా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం బీరంగూడ డివిజన్ పరిధిలోని మారుతి నగర్ మధుర నగర్ కాలనీలో పర్యటించి సమస్యలపై ఆరా తీశారు. అంతేకాకుండా కాలనీవాసులతో సమస్యలు అడిగి తెలుసుకున్నాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలనీలలో రోజురోజుకు జనాభా పెరుగుతున్న సందర్భంగా జనాభాకు అనుగుణంగా అభివృద్ధి అవసరమని ఆయన అన్నారు. అందుకు ప్రతి కాలనీలో జనాభా ప్రాతిపదికన అవసరానికి అనుగుణంగా డ్రైనేజ్, రహదారులు విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ రెండు కాలనీలలో ప్రధానమైన సమస్య వర్షపు నీరు కాలనీలోకి చేరి ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఉందని గుర్తించడం జరిగిందని, అందుకు ఈ సమస్య పరిష్కారానికి వర్షపు నీటి కాలువలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి కాలనీలో అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్ సీనియర్ నాయకులు జగదీష్ రమేష్ గౌడ్, సునీత, లక్ష్మీకాంత్ రెడ్డి, దాసు యాదవ్ మల్లేష్ తదితర కాలనీలో ప్రజలు పాల్గొన్నారు.

Next Story