హయత్‌​నగర్​ ఎంఈవోకు రూ.5 వేల జరిమానా..

by Kodari Anjali |

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలో అడిగిన వివరాలను నిర్ణీత వ్యవధిలోగా ఇవ్వనందుకు హయత్​నగర్​ మండల విద్యాధికారి (ఎంఈవో) కర్నె శ్రీనివాస్‌కు రాష్ట్ర సమాచార కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది.

హయత్‌​నగర్​ ఎంఈవోకు రూ.5 వేల జరిమానా..
X

దిశ, వనస్థలిపురం: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలో అడిగిన వివరాలను నిర్ణీత వ్యవధిలోగా ఇవ్వనందుకు హయత్​నగర్​ మండల విద్యాధికారి (ఎంఈవో) కర్నె శ్రీనివాస్‌కు రాష్ట్ర సమాచార కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనకు రూ.5,000 జరిమానా విధిస్తూ ఆర్టీఐ కమిషనర్ దేశాల భూపాల్ ఆదేశాలు జారీ చేశారు. వివరాళ్లోకి వెళ్తే .. హయత్​నగర్​ మండలానికి చెందిన అడ్వకేట్, ఆర్టీఐ కార్యకర్త మహేశ్ బాబు చొల్లేటి కొంతకాలం కిందట హయత్​నగర్​ మండల ఎంఈవో ఆఫీస్ ​నుంచి కొన్ని వివరాలను కోరారు. అయితే గడువు ముగిసినప్పటికీ ఎంఈవో శ్రీనివాస్ ఆ సమాచారాన్ని దరఖాస్తుదారుడికి ఇవ్వలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితుడు సమాచార కమిషన్‌ను ఆశ్రయించాడు. శనివారం కమిషన్ ఎదుట విచారణ జరిగింది. బాధితుడికి సమాచారం ఇవ్వడంలో ఎంఈవో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కమిషనర్ నిర్ధారించారు. చట్టాన్ని గౌరవించని అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తూ.. ఎంఈవోకు వెంటనే రూ.5 వేల జరిమానా విధించారు. అంతేకాకుండా, ఆ జరిమానా మొత్తాన్ని ఆలస్యం చేయకుండా అక్కడికక్కడే ‘ఫోన్‌పే’ ద్వారా డిజిటల్ పేమెంట్ చేయించి రికవరీ చేయడం విశేషం. సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేసే అధికారులకు ఈ తీర్పు ఒక హెచ్చరికని కమిషన్ స్పష్టం చేసింది.

Next Story