కాంగ్రెస్‌లోకి పలువురి చేరికలు..

by Kodari Anjali |

మదనాపూర్ మండలంలోని పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్‌లోకి పలువురి చేరికలు..
X

దిశ, మదనాపురం: మదనాపూర్ మండలంలోని పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్టు వారు తెలిపారు. చేరిన వారిలో మదనాపురం టౌన్ రైతుబంధు అధ్యక్షుడు రంగన్న అదేవిధంగా రాజు, కురుమన్న మొదలైన వారు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ వెంకట్ నారాయణ, రామకృష్ణ, శేఖర్, జక్కుల నాగన్న, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story