- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరు వికెట్లతో విజృంభించిన గుర్నూర్ బ్రార్.. రెండో టెస్టులో భారత్ ‘ఏ’ ఘన విజయం
శ్రీలంక ‘ఏ’తో జరిగిన రెండో టెస్టులో భారత్ ‘ఏ’ జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

దిశ, స్పోర్ట్స్ : శ్రీలంక ‘ఏ’తో జరిగిన రెండో టెస్టులో భారత్ ‘ఏ’ జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. డ్రా దిశగా సాగిన గేములో ఆఖరి రోజు భారత ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ 6 వికెట్లతో విజృంభించి జట్టును గెలిపించాడు. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో భారత్ ‘ఏ’ కైవసం చేసుకుంది. తొలి టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. గల్లె వేదికగా జరిగిన రెండో టెస్టులో మొదట తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 366 రన్స్ చేయగా.. భారత్ 543 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 541/8తో ఆట ఆరంభించిన భారత్ ‘ఏ’ మరో రెండు రన్స్ మాత్రమే జోడించి ఆఖరి రెండు వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. అయితే ,తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆదివారమే మ్యాచ్‌లో ఆఖరి రోజు కావడంతో డ్రా అయ్యేలానే కనిపించింది.
కానీ గుర్నూర్ బ్రార్ సంచలన ప్రదర్శన చేశాడు. 6 వికెట్లతో చెలరేగిపోయాడు. దీంతో శ్రీలంక ‘ఏ’ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూకట్టారు. 48.3 ఓవర్లు ఆడిన ఆ జట్టు 209 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో అషెన్ బండారా(87) మాత్రమే పోరాడాడు. అతని పోరాటంతో శ్రీలంక ‘ఏ’ ఇన్నింగ్స్ ఓటమి నుంచి బయటపడింది కానీ పరాజయం నుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది. తొలి ఇన్నింగ్స్ లీడ్ 177 పరుగులు పోగా శ్రీలంక ‘ఏ’.. భారత్ ముందు 33 పరుగుల లక్ష్యం పెట్టింది. ఆ స్వల్ప లక్ష్యాన్ని భారత్ ‘ఏ’ జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోయి పూర్తి చేసి సిరీస్‌ను దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన గుర్నూర్ భారత్ ‘ఏ’ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.






