సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులపై రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ సమీక్ష

by Kodari Anjali |

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పునరాభివృద్ధి పనులను రైల్వే బోర్డు చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సతీష్ కుమార్ శనివారం రాత్రి క్షుణ్ణంగా పరిశీలించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులపై రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ సమీక్ష
X

దిశ, సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పునరాభివృద్ధి పనులను రైల్వే బోర్డు చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సతీష్ కుమార్ శనివారం రాత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్ దక్షిణ ముఖద్వారం నుంచి తనిఖీలు ప్రారంభించిన ఆయన పునరుద్ధరించిన ప్రవేశ ద్వారం, గ్రౌండ్, మొదటి, రెండో అంతస్తుల్లో పూర్తయిన పనులు, అలాగే నూతన భూగర్భ పార్కింగ్ సదుపాయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రాజెక్టు పురోగతిపై వివరాలు అందించారు. పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను సతీష్ కుమార్ ఆదేశించారు. నిర్మాణ ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, పునరాభివృద్ధి పనుల కారణంగా ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించారు. అంతకుముందు హైదరాబాద్‌లోని మేధా సర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను సందర్శించిన ఆయన, సంస్థ తయారీ విభాగాలను పరిశీలించి ఉత్పత్తి ప్రక్రియపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ తనిఖీల్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్తో పాటు పలువురు సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు.

Next Story