- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐఫోన్‌లో కొత్త ఫీచర్.. అవతలి వ్యక్తి ఆన్‌లైన్ స్టేటస్ ఈజీగా తెలిసిపోతుంది!
వాట్సాప్ ప్రవేశ పెడుతున్న ‘Online Status Dot’ ఫీచర్ ఇప్పటికే కొంతమంది iOS యూజర్లకు అందుబాటులోకి వచ్చినట్లు WABetaInfo వెల్లడించింది.

దిశ, ఫీచర్స్ : యాపిల్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఏంటంటే.. వాట్సాప్ (WhatsApp)తన iOS వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెడుతోంది. ఇకపై మీ కాంటాక్ట్స్ యాప్‌లో ఆన్‌లైన్‌లో (యాక్టివ్‌గా) ఉన్నప్పుడు వారి ప్రొఫైల్ ఫోటో పక్కన చిన్న ఆకుపచ్చ డాట్ (Green Dot) కనిపిస్తుంది. దీనిని బట్టి మీ కాంటాక్ట్ లిస్టులో ఉన్న యూజర్లు ప్రస్తుతం యాప్‌ను ఉపయోగిస్తున్నారా లేదా అని ఈజీగా తెలుసుకోవడానికి సహాయపడుతుంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ‘Green Dot Online Indicator” లేదా “Online Status Dot” అని పిలుస్తున్నారు. ఇంతకీ ఇదెలా పనిచేస్తుంది? ఉపయోగాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వాట్సాప్ ప్రవేశ పెడుతున్న ‘Online Status Dot’ ఫీచర్ ఇప్పటికే, WhatsApp బీటా వెర్షన్ 24.10.72లో కొంతమంది iOS యూజర్లకు ప్రస్తుతం (జులై, 2026) అందుబాటులోకి వచ్చినట్లు WABetaInfo బయటపెట్టింది. అయితే అధికారిక స్టేబుల్ వెర్షన్‌లో మాత్రం ఇంకా విడుదల కాలేదు. అయితే Apple TestFlight ప్రోగ్రామ్ ద్వారా బీటా(26.26.10.72) వినియోగదారులు దీన్ని పరీక్షించవచ్చు. ఇప్పటికైతే.. రోలౌట్ గ్రాడ్యువల్‌గా జరుగుతోంది కాబట్టి వచ్చే వారాల్లో మరిన్ని బీటా టెస్టర్లు ఈ ఫీచర్‌ను పొందే అవకాశం ఉందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి ఈ కొత్త ఆన్‌లైన్ ఇండికేటర్ యూజర్ల మధ్య కమ్యూనికేషన్‌ను మరింత సులభతరం చేస్తుందని భావిస్తున్నారు.
ఎలా పొందాలి?
*Apple TestFlight ప్రోగ్రామ్‌లో WhatsApp బీటా యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి ఉంటేనే సాధ్యం.
*ముఖ్యంగా కొత్త అప్‌డేట్ వెర్షన్ లేదా తాజా బీటా వెర్షన్ అయి ఉండాలి.
*రోలౌట్ గ్రాడ్యువల్‌గా జరుగుతోంది కాబట్టి అందరికీ ఒకేసారి అందుబాటులోకి రాదు. అయితే క్రమంగా అందరు యూజర్లకూ అందుబాటులోకి రానుంది.
*సాధారణ యూజర్లకు అధికారిక వెర్షన్‌లో కొన్ని వారాలు లేదా నెలలు పట్టవచ్చు.
ముఖ్యమైన ప్రయోజనాలు
*మీ కాంటాక్ట్ లిస్ట్‌లో వాట్సాప్ యూజర్ ఆన్‌లైన్‌లో ఉన్నదీ లేనిదీ ఈజీగా తెలిసిపోతుంది.
*ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేయడానికి చాట్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు.
*యూజర్ అనుభవం మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ లేదా క్లోజ్ ఫ్రెండ్స్‌తో రియల్-టైమ్ కమ్యూనికేషన్ సులభం అవుతుంది.






