- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రష్మిక ముందు భారీ టార్గెట్.. వారిని బీట్ చేయగలదా?
రష్మిక 'మైసా'తో విజయశాంతి, అనుష్క, సమంతలను బీట్ చేయగలదా?

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత వేగంగా స్టార్ హీరోయిన్‌గా ఎదిగి, ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తూ కెరీర్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న అతికొద్ది మంది హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. సాధారణంగా స్టార్ హీరోయిన్ హోదా వచ్చిన తర్వాత చాలామంది నటీమణులు కమర్షియల్ సినిమాలతో పాటు తమ నటనకు గుర్తింపు తెచ్చుకునేందుకు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల వైపు అడుగులు వేస్తుంటారు. తెలుగు సినీ పరిశ్రమలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పలువురు విజయాలు సాధించినప్పటికీ, మాస్ యాక్షన్ కథల్లోనూ ప్రేక్షకులను మెప్పించిన వారు మాత్రం చాలా తక్కువ. అలాంటి వారిలో విజయశాంతి, అనుష్క, తాజాగా సమంత పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి.
ఇప్పుడు అదే దారిలో రష్మిక కూడా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఆమె 'మైసా' చిత్రంలో పవర్‌ఫుల్ మాస్ పాత్రలో కనిపించబోతోంది. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలను బట్టి చూస్తే, ఈ సినిమాలో రష్మిక పాత్ర ఎంతో ప్రభావవంతంగా, యాక్షన్ ప్రధానంగా ఉండబోతుందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే రష్మిక కెరీర్ మరో స్థాయికి చేరుకుంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే హీరోయిన్‌గా ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. మరి 'మైసా'తో రష్మిక ఆ స్థాయి విజయాన్ని అందుకుంటుందా? విజయశాంతి, అనుష్క, సమంతల తరహాలో మాస్ ప్రేక్షకులను మెప్పించగలదా? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.






