- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తహసీల్దార్ సర్వర్
ములుగు జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన కన్నాయిగూడెం మండలంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదిలో నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోందని కన్నాయిగూడెం తహసీల్దార్ సర్వర్ తెలిపారు.

దిశ, కన్నాయిగూడెం : ములుగు జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన కన్నాయిగూడెం మండలంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదిలో నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోందని కన్నాయిగూడెం తహసీల్దార్ సర్వర్ తెలిపారు. గత రెండు రోజులుగా గోదావరిలో నీటి ప్రవాహం 2,700 క్యూసెక్కుల నుంచి 65,000 క్యూసెక్కులకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనూ నదులు, వాగులు, వంకల్లోకి దిగరాదని, వరద ప్రవాహంలో నదులను దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. అలాగే పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాగులు, వంకలు దాటించే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ప్రజలందరూ రెవెన్యూ, పోలీసు శాఖ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని తహసీల్దార్ సర్వర్ విజ్ఞప్తి చేశారు.






