- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చీర కట్టులో మాస్ గ్లామర్‌తో కుర్రకారును ఫిదా చేస్తున్న శార్వరి వాఘ్
శారీలో శర్వరి వాఘ్ గ్లామర్ షో.. చూపు తిప్పుకోనివ్వని అందాలు.

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ బాలీవుడ్ బ్యూటీ శర్వరి వాఘ్‌కు తెలుగు ప్రేక్షకుల్లో పెద్దగా పరిచయం లేకపోయినా, హిందీ చిత్రసీమలో మాత్రం మంచి గుర్తింపు ఉంది. వరుస అవకాశాలతో ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీయెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా కెరీర్‌ను కొనసాగిస్తోంది.
సినీ ప్రయాణాన్ని సహాయ దర్శకురాలిగా ప్రారంభించిన శర్వరి, 2020లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ది ఫర్గాటెన్ ఆర్మీ – ఆజాదీ కే లియే వెబ్ సిరీస్‌తో నటిగా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం 2021లో విడుదలైన 'బంటీ ఔర్ బబ్లీ 2' సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. తాజాగా ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన ఆల్ఫా చిత్రంలోనూ శర్వరి కీలక పాత్రలో నటించింది.
సినిమాల్లో తన గ్లామర్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ అందాల భామ, సోషల్ మీడియాలోనూ అదే జోరును కొనసాగిస్తోంది. ఎప్పటికప్పుడు స్టైలిష్ ఫోటోషూట్లతో అభిమానులను ఆకట్టుకుంటూ నెట్టింట సందడి చేస్తోంది. తాజాగా శర్వరి షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ లేటెస్ట్ ఫోటోల్లో భారీ ఎంబ్రాయిడరీ వర్క్‌తో మెరిసే చీరను ధరించిన శర్వరి, దానికి మ్యాచ్ అయ్యే స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో తన అందాలను మరింత ఎలివేట్ చేసింది. ముఖ్యంగా ఆమె ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లామర్ అందాలు అభిమానుల చూపును కట్టిపడేస్తున్నాయి.
ముఖంపైకి మెల్లగా జారిన కురులు ఆమె లుక్‌కు మరింత ఆకర్షణను తీసుకురాగా, చెవులకు ధరించిన స్టైలిష్ ఇయర్‌రింగ్స్ స్పెషల్ హైలైట్‌గా నిలిచాయి. మొత్తంగా ఈ ఫోటోల్లో శర్వరి తన అందం, స్టైల్‌తో నెటిజన్లను ఫిదా చేస్తుండగా, ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.






