- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకే ఉచిత విమానయానం...
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించి వారు ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే ఉద్దేశంతోనే ఉచిత విమాన యాన సౌకర్యం కల్పించినట్లు ఆదివారం కాంగ్రెస్ నాయకులు, మాడ్గుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి మస్న విష్ణు నేత అన్నారు.

దిశ,మాడ్గుల : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించి వారు ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే ఉద్దేశంతోనే ఉచిత విమాన యాన సౌకర్యం కల్పించినట్లు ఆదివారం కాంగ్రెస్ నాయకులు, మాడ్గుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి మస్న విష్ణు నేత అన్నారు. ఆయన గతంలో ఇచ్చిన హామీ మేరకు 2026 సంవత్సరంలో పదవ తరగతి ఉత్తమ ప్రతిభ కనబరిచి 500 పైచిలుకు మార్కులు సాధించిన మొదటి ర్యాంకు విద్యార్థిని అన్నెపాక శరణ్య, రెండవ ర్యాంకు విద్యార్థిని మస్న మేఘన, మూడో ర్యాంకు విద్యార్థి కాట్ల భవ్య శ్రీ ల తోపాటు పాఠశాల ఉపాధ్యాయులు దేవయ్యతో కలిసి హైదరాబాద్ నుంచి తిరుపతికి విమాన ప్రయాణాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కల్పించడమే కాకుండా మౌలిక వసతుల కల్పనకు అధిక నిధులు కేటాయిస్తున్నట్లు ఈ అవకాశాన్ని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అన్నారు. మునుముందు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి మరింత మంది విద్యార్థులను ప్రోత్సహిస్తానని పేర్కొన్నారు. ఉచిత విమానయానం కల్పించడంతోపాటు అభ్యుదయ భారత్ ట్రస్ట్ ఫౌండేషన్ చైర్మన్ సూదిని పద్మా రెడ్డి సహకారంతో విద్యార్థులకు ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు మస్న విష్ణుకు కృతజ్ఞతలు తెలిపారు.






