హర్మూజ్ జలసంధిలో కొత్త టోల్‌ విధానం..! ఇరాన్ కీలక నిర్ణయం

by Ramesh Naini |

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ()లో కొత్త టోల్‌ విధానాన్ని అమలు చేయడానికి ఇరాన్ చర్యలు చేపడుతోంది.

హర్మూజ్ జలసంధిలో కొత్త టోల్‌ విధానం..! ఇరాన్ కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Hormuz)లో కొత్త టోల్‌ విధానాన్ని అమలు చేయడానికి ఇరాన్ చర్యలు చేపడుతోంది. హర్మూజ్‌ తమ ప్రాదేశిక జలాల్లో భాగంగా ఉన్నందున, అక్కడ ప్రయాణించే నౌకల నుంచి ‘సేవా రుసుము’ వసూలు చేస్తామని చైనాలోని ఇరాన్ రాయబారి అబ్దుల్ రెజా రహ్మానీ వెల్లడించారు. ఈ విషయంపై ఒమన్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మిత్రదేశాలకు రాయితీలు..

అంతర్జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. కష్టసమయంలో తమకు సహకరించిన మిత్ర దేశాలకు ఈ సేవా రుసుము విషయంలో ప్రత్యేక ప్రాధాన్యం, రాయితీలు కల్పించనున్నట్లు ఇరాన్‌ యోచిస్తోంది. హర్మూజ్‌లో ప్రయాణ భద్రత, నౌకల రాకపోకల పర్యవేక్షణ, పర్యావరణ పరిణామాల నియంత్రణ వంటి అంశాలను ఇకపై ఒమన్‌ సహకారంతో ఇరాన్‌ చూసుకోనుంది. ఈ జలసంధి ఇతర దేశాలు సైనిక విన్యాసాలు చేపట్టడానికి రంగస్థలం కాదని ఇరాన్‌ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కాజెమ్ గరీబాబాది స్పష్టం చేశారు. మరోవైపు, ఇరాన్‌ నిర్దేశించిన మార్గంలో కాకుండా ఒమన్‌ తీరం వెంబడి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎనిమిది నౌకలను అధికారులు వెనక్కి పంపినట్లు షిప్పింగ్‌ డేటా నివేదికలు వెల్లడించాయి.

Next Story