ఇదంతా అందుకే..?: ఇప్పుడు రంగంలోకి మరో పార్టీ కూడా..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-05 09:11:59  IST  )

సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌పై ఏపీ బీజేపీ నేతలు సీరియస్ అయ్యారు. ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రకాశ్ రాజ్ ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరును తప్పుబట్టారు....

ఇదంతా అందుకే..?: ఇప్పుడు రంగంలోకి  మరో పార్టీ కూడా..!
X

దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌(Film actor Prakash Raj)పై ఏపీ బీజేపీ(AP BJP) నేతలు సీరియస్ అయ్యారు. ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రకాశ్ రాజ్ ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరును తప్పుబట్టారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Deputy CM Pawan Kalyan)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్(YouTuber Bachalakuri Joseph, alias) అలియాస్ ప్రశ్న రావణ్‌కు మద్దతివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పును తప్పు అని చెప్పాల్సింది పోయి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారికి అండగా నిలబడటమేంటని ప్రశ్నించారు.

ఏపీపై మొదలైన కాలకేయుల దాడి


అంతేకాదు ఆంధ్రప్రదేశ్‌పై కర్ణాటక, తెలంగాణలోని కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంపై కాలకేయుల దాడి మొదలైందని బీజేపీ నేత విష్ణు వర్థన్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని, పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జోసెఫ్‌తో పాటు మిగిలిన వారిపైనా సిట్ ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరపించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు ఎవరైతే కుట్రలు పన్నేందుకు ప్రయత్నించారో వారిని కూడా అరెస్ట్ చేయాలని బీజేపీ నేత విష్ణు వర్థన్ రెడ్డి చెప్పారు.

మాటలు తెచ్చిన తంటాతోనే..

కాగా ఇటీవలకాలంలో రాష్ట్రంలో రాజకీయ వేడి పెరిగింది. ఇదంతా మాటలు తెచ్చిన తంటాతోనే జరిగింది. కొందరు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. దీంతో నోటికి ఎంత మాటొస్తే అంత విచ్చలవిడిగా మాట్లాడేస్తున్నారు. కొందరైతే ప్రాంతీయ ముసుగులో మాట్లాడుతుండగా కొందరు రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారు. కుల, మత, ప్రాంతీయ మీటింగుల పేరుతో పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. దీంతో జనసేన నేతలు, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ మేరకు తన అభిమాన నటుడిని, అధినేతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిపై ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో పోలీసులు కేసులు నమోదు చేసి చర్యలు చేపడుతున్నారు.

అవకాశవాదులు కొందరు..

అయితే దీన్నే అవకాశంగా తీసుకుని కూడా కొందరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే వీరిని ప్రోత్సహించేలా కొంతమంది రాజకీయ నాయకులు, ప్రాంతీయ వాదులు, సినీ నటులు సైతం మద్దతుగా మాట్లాడుతున్నారు. దీంతో ఆయా వ్యక్తులను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని పార్టీల పరంగా కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు బీజేపీ నేతలు సైతం అదే బాటలో నిలుస్తున్నారు. సోషల్ అవేర్నెస్ వదిలేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి కూడా వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..!

Next Story