పూజ కార్యక్రమాలతో మొదలైన నార్ని నితిన్ కొత్త సినిమా

by Pulgam srinivas |

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన నార్ని నితిన్ కొత్త సినిమా.

పూజ కార్యక్రమాలతో మొదలైన నార్ని నితిన్ కొత్త సినిమా
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్న యువ నటుడు నార్ని నితిన్ తాజాగా తన కొత్త సినిమాను ప్రారంభించాడు. ఈ చిత్రంలో కన్నడ నటి మెగా శెట్టి కథానాయికగా నటించనుండగా, 'జూనియర్' ఫేమ్ రాధాకృష్ణారెడ్డి దర్శకత్వం వహించనున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హీరో, హీరోయిన్‌తో పాటు చిత్రబృందానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కెరీర్‌ను ప్రారంభించిన తక్కువ సమయంలోనే వరుస విజయాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నార్ని నితిన్, ఈ చిత్రంతో కూడా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో, నార్ని నితిన్‌కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Next Story