హాస్టల్ నుంచి విద్యార్థుల పరార్.. భద్రతా చర్యల పై తల్లిదండ్రుల ఆందోళన

by Jakkula.Mamatha |

గిరిజన ఆశ్రమ పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు పరారైన ఘటన జిల్లాలో కలకలం రేపింది.

హాస్టల్ నుంచి విద్యార్థుల పరార్.. భద్రతా చర్యల పై తల్లిదండ్రుల ఆందోళన
X

దిశ, ఆసిఫాబాద్: గిరిజన ఆశ్రమ పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు పరారైన ఘటన జిల్లాలో కలకలం రేపింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని హట్టి ఆశ్రమ బాలుర పాఠశాలలో సిర్పూర్ యూ మండలానికి చెందిన పెందుర్ హన్మంతు, మేస్రం రాము, ఆత్రం రాంషావులు 4, 5, 6వ తరగతుల్లో చదువుకుంటున్నారు. శనివారం రాత్రి హాస్టల్ సిబ్బంది కళ్ళు కప్పి పరారయ్యారు. ఆదివారం ఉదయం రాసిమెట్ట గ్రామ సమీపంలో కాలినడకన వెళ్తున్న ఆ ముగ్గురు బాలురను స్థానికులు అనుమానంతో ఆపి వివరాలు అడగగా.. తాము హట్టి ఆశ్రమ పాఠశాల విద్యార్థులమని తెలపగా గ్రామస్థులు అప్రమత్తమై విద్యార్థులను రాసిమెట్ట గ్రామంలోనే సురక్షితంగా ఉంచారు. కాగా, 10 రోజుల క్రితం ఇలాగే రెబ్బెన గురుకుల హాస్టల్ నుంచి ఇంటర్ చదువుకోనే విద్యార్థిని ఇలాగే హాస్టల్ ప్రహారీ గోడ దూకి పరారైంది. దీంతో జిల్లాలో 10 రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన చోటు చేసుకోవడంతో హాస్టల్ భద్రత చర్యలు పట్ల పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలను తల్లిదండ్రుల వలే.. వారి బాగోగులు చూసుకోవాల్సిన హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం ఉండటంతో సిబ్బంది పనితీరు పై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story