ఆలయాలు ధర్మానికి నిలయాలు : దత్తగిరి పీఠాధిపతులు

by Taduka Kalyani |   (  Updated:2026-07-05 09:25:35  IST  )

హిందూ దేవాలయాలు ధర్మరక్షణకు నిలయాలని, నూతన ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్‌ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతులు అన్నారు.

ఆలయాలు ధర్మానికి నిలయాలు : దత్తగిరి పీఠాధిపతులు
X

దిశ, ఝరాసంగం: హిందూ దేవాలయాలు ధర్మరక్షణకు నిలయాలని, నూతన ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్‌ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతులు అవధూత గిరి మహారాజ్, డాక్టర్ సిద్ధేశ్వరానంద గిరి మహారాజ్ అన్నారు. హైదరాబాద్‌ నిజాంపేట్‌కు చెందిన దాతలు సునీత–భద్రారెడ్డి దంపతులు రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన రాజగోపురాన్ని ఆదివారం ఉదయం వేదోక్తంగా నిర్వహించిన పూజల మధ్య ప్రారంభించారు. ధ్వజారోహణం, విశేష హోమాలు, యంత్రస్థాపన, మహాపూర్ణాహుతి శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం రాజగోపుర మహా కుంభస్థాపన నిర్వహించి, పీఠాధిపతులు మహా మంగళహారతి చేశారు. క్రేన్ సహాయంతో 5 కలశాలను రాజగోపుర శిఖరంపై ప్రతిష్ఠించారు. అనంతరం భక్తులు ప్రవేశం చేశారు. రాజగోపురం నిర్మాణ దాత భద్రారెడ్డి దంపతులు ఇప్పటికే బర్దిపూర్ గ్రామానికి కోటి రూపాయలకు పైగా సేవా కార్యక్రమాలు చేపట్టడంతో అభినందించారు. ప్రభుత్వ పాఠశాలకు చిల్డ్రన్ పార్క్, పాఠశాల కంప్యూటర్లు, హనుమాన్ దేవాలయ అభివృద్ధికి, మాచునూర్ వద్ద స్వాగత తోరణం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని వారిని ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు.

Next Story