- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధూమపానంతో దంతాలకూ రిస్కే.. త్వరగా ఊడిపోయే చాన్స్!
స్మోకింగ్ వల్ల నికోటిన్ అనే హానికారక రసాయనం రక్త నాళాలను సంకోచింపజేస్తుంది. ఈ సమయంలో చిగుళ్లకు ఆక్సిజన్, రక్త ప్రసరణ తగ్గి దంతాలు బలహీనంగా మారుతాయి.

దిశ, ఫీచర్స్ : ధూమపానం ఆరోగ్యానికి హానికరమని, క్యాన్సర్ కారకమని తెలిసిందే. అయితే ఇది దంతాల సమస్యలకు కూడా దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. స్మోక్ చేయనివారితో పోలిస్తే.. స్మోక్ చేసేవారు వాటిని త్వరగా కోల్పోయే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువని చెబుతున్నారు. ఎందుకంటే.. స్మోక్ చేస్తున్నప్పుడు పీల్చే పొగ, టొబాకోలో నికోటిన్‌తో పాటు పలు హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి చిగుళ్ల (gums)లో రక్త ప్రసరణను తగ్గిస్తాయి. దీంతో చిగుళ్లకు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందక, అవి బలహీనపడతాయి. క్రమంగా ఊడిపోయే ప్రమాదం పెరుగుతుంది.
స్మోకింగ్ సమయంలో రిలీజ్ అయ్యే నికోటిన్ హానికారక వాసోకాన్‌స్ట్రిక్టర్ (vasoconstrictor)గా పనిచేసి రక్త నాళాలను సంకోచింపజేస్తుంది. దీంతో చిగుళ్లకు ఆక్సిజన్, రక్త ప్రసరణ తగ్గి ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు దారితీస్తుంది. ఇందులోని మరో రసాయనం టార్ (tar), బెంజీన్, ఫార్మాల్డిహైడ్, ఆర్సెనిక్ వంటి వంటివి కూడా చిగుళ్లను చికాకుపెట్టి, రక్త ప్రసరణను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంటున్నారు. అందుకే తరచుగా ధూమపానం చేసేవారిలో నోటిలో బ్యాక్టీరియాలు పేరుకుపోవడంవల్ల ‘నోటి పూత’, చిగుళ్ల వాపు (gum disease), దంతక్షయం వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా దంత చికిత్సలు (ఇంప్లాంట్స్, సర్జరీలు) చేయించుకున్న తర్వాత గాయాలు మానడం కూడా నెమ్మదిగా జరుగుతుంది. కాబట్టి ధూమపానానికి దూరంగా ఉండటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






