ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ మూవీపై అదిరిపోయే అప్డేట్

by Pulgam srinivas |

ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ మూవీ అనౌన్స్‌మెంట్‌ను జూలై 6 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ మూవీపై అదిరిపోయే అప్డేట్
X

దిశ, వెబ్ డెస్క్: నటుడిగా, దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథన్ కొంతకాలం క్రితం 'lik' చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే మంచి జోష్‌లో కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్న ఆయనకు ఈ సినిమా స్పీడ్ బ్రేకర్‌గా మారింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దాంతో ప్రదీప్ రంగనాథన్ తన తదుపరి చిత్రాన్ని ఏ దర్శకుడితో చేయబోతున్నాడు? ఏ జానర్‌ను ఎంచుకోనున్నాడు? అనే ఆసక్తి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లో కూడా నెలకొంది. ఇలాంటి సమయంలోనే ఆయన నెక్స్ట్ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. తాజాగా ప్రదీప్ రంగనాథన్ తదుపరి సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది.

ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ జూలై 6వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే విడుదల చేసిన పోస్టర్‌లో దర్శకుడు ఎవరు? ఏ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది? వంటి వివరాలను వెల్లడించలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు రేపు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. 'lik' చిత్రంతో ఎదురైన నిరాశను ఈ నెక్స్ట్ మూవీతో దాటుకుని, ప్రదీప్ రంగనాథన్ మరోసారి సాలిడ్ విజయాన్ని అందుకుని కమ్‌బ్యాక్ ఇస్తాడని ఆయన అభిమానులు గట్టి నమ్మకంతో ఎదురుచూస్తున్నారు.




Next Story