మంచినీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

by Jakkula.Mamatha |

గత నాలుగైదు రోజుల నుంచి మిషన్ భగీరథ మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో మిర్జాపల్లి రైల్వే స్టేషన్‌లో మహిళలు ఖాళీ బిందెలతో రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

మంచినీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
X

దిశ, చిన్నశంకరంపేట: గత నాలుగైదు రోజుల నుంచి మిషన్ భగీరథ మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో మిర్జాపల్లి రైల్వే స్టేషన్‌లో మహిళలు ఖాళీ బిందెలతో రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తాగడానికి నీరు లేక నాలుగైదు రోజుల నుంచి మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో అలమటిస్తున్న ప్రజా ప్రతినిధులు స్పందించడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గ్రామ సర్పంచ్ స్పందించి మంచి నీటి ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న సర్పంచ్ సందని సునీత యాదగిరి మాట్లాడుతూ, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సహకారంతో గ్రామంలో మంచినీటి సమస్య తీరుస్తారని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.

Next Story