ప్రశ్న రావణ్‌‌కు మరో ఎదురుదెబ్బ.. తాజాగా రాజద్రోహం కేసు నమోదు

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-05 07:07:55  IST  )

ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్‌కు మరో దిమ్మతిరిగే షాక్ తగిలింది.

ప్రశ్న రావణ్‌‌కు మరో ఎదురుదెబ్బ.. తాజాగా రాజద్రోహం కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan), సీఎం చంద్రబాబు (CM Chandrababu)పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో వివిధ కేసుల నమోదుతో కోర్టు ఆదేశాల మేరకు ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ ప్రస్తుతం పోలీసులు కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనకు మరో ఊహించిన షాక్ తగిలింది. తాజాగా ప్రశ్న రావణ్‌పై నిన్న రాత్రి గన్నవరం పోలీస్ స్టేషన్‌లో రాజద్రోహం కేసు నమోదైంది. జనసేన నేత, రోడ్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ ఫిర్యాదు మేరకు ఆయనపై ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఇందులో భాగంగా రావణ్‌పై U/s 147,148,152,192,197(1)(d),353(1)(b) & Sec 13, 39 చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం 1967 (UAPA Act) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడం, సమాజంలో విధ్వేషాలు రెచ్చగొట్టడం, సమగ్రతకు భంగం కలిగించేలా చర్యలు చేపట్టడం వంటి సెక్షన్లు నమోదు చేశారు. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడటం, దేశద్రోహ పూరిత, తిరుగుబాటు చర్యలను రెచ్చగొట్టడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.

Next Story