- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో కొనసాగుతున్న ‘SIR’.. ఈఎఫ్ పంపిణీలో ముందున్న జిల్లాలు ఇవే
తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రక్రియకు సంబంధించి తాజాగా తెలంగాణ ఎన్నికల సంఘం అధికారులు గణాంకాలు విడుదల చేశారు. జులై 5 ఉదయం 8 గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా 2,92,31,268 (86.42శాతం) ఎన్యుమరేషన్ పత్రాలు (Enumeration forms) విజయవంతంగా పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. పంపిణీ చేసిన ఈఎఫ్ పత్రాల్లో ఇప్పటివరకు 16,79,943 (4.97 శాతం) డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు.
జోగులాంబ గద్వాల ఫస్ట్.. మేడ్చల్ లాస్ట్:
రాష్ట్రంలోనే అత్యధికంగా ఓటర్లు కలిగిన జిల్లాగా హైదరాబాద్ ఉంది. ఇక్కడ మొత్తం 47,36,669 మంది ఓటర్లు ఉండగా ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 36,99,743 మంది, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 29,79,130 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీలో జోగులాంబ గద్వాల (99.83శాతం) తో అన్ని జిల్లాల కంటే ముందు వరుసలో ఉందని, వనపర్తి (99.67శాతం), నిర్మల్ (99.63శాతం) జిల్లాలు ఈఎఫ్ (EFs) పంపిణీ జరిగినట్లు పేర్కొన్నారు. ఈఎఫ్ పంపిణీలో మేడ్చల్ మల్కాజిగిరి (57.79 శాతం)తో చివరి స్థానంలో ఉంది. ఇక ఈఎఫ్-ల డిజిటలైజేషన్ ప్రక్రియలో యాదాద్రి భువనగిరి (25.67శాతం), కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా (20.39శాతం), నల్గొండ (15.77శాతం) జిల్లాలు మిగతా జిల్లాల కంటే మెరుగైన శాతాన్ని నమోదు చేయగా మేడ్చల్ మల్కాజిగిరి (0.79శాతం)తో చివరి స్థానంలో ఉంది.






