అనిల్ రావిపూడి మల్టీస్టారర్ నుంచి కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ రిలీజ్

by Pulgam srinivas |

కళ్యాణ్‌రామ్ బర్త్‌డేకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన అనిల్ రావిపూడి.

అనిల్ రావిపూడి మల్టీస్టారర్ నుంచి కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ రిలీజ్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం #VenkyAnil5 మరియు #NKRAR2 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోంది. ఇక నేడు నందమూరి కళ్యాణ్‌రామ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో కళ్యాణ్‌రామ్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

విడుదలైన పోస్టర్‌లో కళ్యాణ్‌రామ్ సంప్రదాయ పంచెకట్టులో, మెడలో పూలదండ ధరించి, స్టైలిష్ సన్‌గ్లాసెస్‌తో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా ఇంటి ఆవరణను పూలతో అందంగా అలంకరించగా, చుట్టూ మహిళలు కోలాటం ఆడుతూ సందడి చేస్తున్న దృశ్యాలు పోస్టర్‌కు మరింత ఆకర్షణను తీసుకొచ్చాయి. ఈ పోస్టర్‌ను బట్టి సినిమాలో అనిల్ రావిపూడి మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి హాస్యం, వినోదం కూడా ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తుండగా, చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.




Next Story