- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాగిరెడ్డిపల్లి గ్రామ ప్రజల ఎన్నో ఏళ్ల కల సాకారం
మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామ ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది.

దిశ, ఊట్కూర్: మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామ ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. గ్రామంలో సబ్ రేషన్ షాపు ఏర్పాటు కావడంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రేషన్ సరుకుల కోసం గ్రామ ప్రజలు సుమారు 3 కిలోమీటర్ల దూరంలోని కొల్లూర్ గ్రామానికి వెళ్లాల్సి వచ్చేది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు రేషన్ తీసుకురావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్రతి నెలా రేషన్ కోసం ప్రయాణించాల్సి రావడంతో సమయం, శ్రమతో పాటు అదనపు ఖర్చు కూడా భరించాల్సి వచ్చేది. ఈ సమస్యను మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లారు. సమస్య తీవ్రతను గుర్తించిన మంత్రి వెంటనే స్పందించి ఎమ్మార్వో అధికారులకు నాగిరెడ్డిపల్లి గ్రామంలో సబ్ రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మంత్రి ఆదేశాల మేరకు అధికారులు నాగిరెడ్డి పల్లి గ్రామంలో సబ్ రేషన్ షాపును ప్రారంభించారు. సబ్ రేషన్ షాప్ ప్రారంభం కావడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ కోరిక నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇకపై రేషన్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామంలోనే సులభంగా రేషన్ సరుకులు పొందే అవకాశం కలగడంతో గ్రామస్థులు మంత్రి కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బస్వరాజు మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యకు మంత్రి గారు తక్షణమే స్పందించి పరిష్కారం చూపడం అభినందనీయమని అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవడం వల్లే ఈ సౌకర్యం గ్రామానికి అందుబాటులోకి వచ్చిందన్నారు. ఉప సర్పంచ్ నరసింహులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు జనార్దన్ రెడ్డి, నాగిరెడ్డి, తెలుగు తిమ్మయ్య, యువకులు పరమేశ్, జగదీష్, టైలర్ శంకర్, కుర్మప్పతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






