- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇళ్ల చుట్టూ మురుగునీరు.. వ్యాధులు సోకే ప్రమాదం!
ఇళ్ల చుట్టూ మురుగునీరు అపరిశుభ్రతతో కాలనీ దుర్గంధంతో నెలకొంది.

దిశ, చిన్నశంకరంపేట: ఇళ్ల చుట్టూ మురుగునీరు అపరిశుభ్రతతో కాలనీ దుర్గంధంతో నెలకొంది. ఉమ్మడి మండలం శేరిపల్లి గ్రామంలో బీసీ కాలనీ చుట్టూ, గజ్వేల్లి, ఎరుకల వీధుల్లో చెత్త చెదారంతో మురుగునీరు నెలకొంది. దీంతో వర్షాకాలం మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, వంటివి ప్రజలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాగా ఈగలు దోమలు కూడా విపరీతంగా ఉన్నాయని కాలనీవాసులు తెలిపారు. ఈ కాలనీలో మొరం పోసి అండర్ డ్రైనేజీ ఏర్పాటు చేసి సిసి రోడ్లు, వేస్తే బాగుంటుందని కాలనీవాసులు పేర్కొన్నారు. అయినప్పటికీ అధికారులు ఈ కాలనీ వద్దకు వచ్చిన దాఖలాలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ వర్షాకాలంలో డ్రైనేజీ లేకపోవడంతో మురుగు ఇండ్ల మధ్యలో నెలకొనడంతో ఈగలు దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో కాలనీవాసులు జ్వరాలు ఇతర వ్యాధులతో సతమతమవుతున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు చొరవ తీసుకొని అవసరమైన ఇండ్ల మధ్య డ్రైనేజీ, నిర్మాణ కాలువలు నిర్మించి ఇండ్ల మధ్య మురుగు లేకుండా చర్యలు తీసుకోవాలని ఇక్కడి కాలనీ వాసులు కోరుతున్నారు.






