బెల్ట్ షాపులు నడిపితే అంతే సంగతులు.. గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం

by Jakkula.Mamatha |

భద్రాచలం పవిత్ర పుణ్యక్షేత్రంలో బెల్ట్ షాప్స్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమానికి సమాయత్తం అవుతున్నారు.

బెల్ట్ షాపులు నడిపితే అంతే సంగతులు.. గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం
X

దిశ, భద్రాచలం: భద్రాచలం పవిత్ర పుణ్యక్షేత్రంలో బెల్ట్ షాప్స్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమానికి సమాయత్తం అవుతున్నారు. స్థానిక సుభాష్ నగర్ కాలనీలో బెల్ట్ షాప్స్ పెట్టి మద్యం అమ్మకాలు జరిపితే తాట తీస్తామని కాలనీలో మహిళలు, యువకులు హెచ్చరిస్తున్నారు. వారం రోజుల క్రితం భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ పాలక వర్గం బెల్ట్ షాప్స్ కు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. పట్టణంలోని అన్ని కాలనీలలో మహిళలు బెల్ట్ షాప్స్ కు వ్యతిరేకంగా ఉద్యమానికి నడుం బిగిస్తున్నారు. కలెక్టర్ అంకిత్ స్వయంగా తనిఖీలు చేపడతారని ప్రచారం జరగడంతో పట్టణంలోని బెల్ట్ షాప్స్ శనివారం సాయంత్రం నుంచి మూసివేశారు. బెల్ట్ షాప్స్‌కు వ్యతిరేకంగా మహిళలు చేపట్టిన ఉద్యమాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేయడంతో సరిపెట్టకుండా, బెల్ట్ షాప్స్ లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Next Story