- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న బాలయ్య.. ఇక ఆ సినిమాకి నో రిస్క్
బాలకృష్ణ 'NBK111' సంక్రాంతి రేసు నుంచి తప్పుకుని డిసెంబర్‌లోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం 'NBK111' వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం సంక్రాంతి రేసు నుంచి తప్పుకొని ఈ ఏడాది డిసెంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న చిత్రాల జాబితాలో మొదట పలువురు స్టార్ హీరోల సినిమాల పేర్లు వినిపించాయి.
అయితే ఒక్కొక్కటిగా ఆ చిత్రాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం క్రేజీ చిత్రాల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం మాత్రమే సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటుండటంతో అనిల్ రావిపూడి చిత్రంపై మరింత అంచనాలు పెరుగుతున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం అనిల్ రావిపూడికి ఇప్పటివరకు పెద్దగా అపజయాలు లేకపోవడం. అలాగే గత రెండేళ్లుగా ఆయన సంక్రాంతి సందర్భంగా విడుదల చేసిన సినిమాలు భారీ విజయాలు సాధించడమే.






