తలకొండపల్లి మండల రైతులకు అందుబాటులో కందుల విత్తనాలు

by Jakkula.Mamatha |

తలకొండపల్లి మండలంలోని రైతులకు పప్పుధాన్యాల్లో స్వయం సమృద్ధి లక్ష్యంగా అమలు చేస్తున్న ఖరీఫ్ 2026-27 పథకం కింద పీఆర్జీ–176 రకం కందుల విత్తన మినీ కిట్లు అందుబాటులో ఉన్నట్లు మండల వ్యవసాయ అధికారి రేణుక చక్రవర్తిని తెలిపారు.

తలకొండపల్లి మండల రైతులకు అందుబాటులో కందుల విత్తనాలు
X

దిశ, తలకొండపల్లి: తలకొండపల్లి మండలంలోని రైతులకు పప్పుధాన్యాల్లో స్వయం సమృద్ధి లక్ష్యంగా అమలు చేస్తున్న ఖరీఫ్ 2026-27 పథకం కింద పీఆర్జీ–176 రకం కందుల విత్తన మినీ కిట్లు అందుబాటులో ఉన్నట్లు మండల వ్యవసాయ అధికారి రేణుక చక్రవర్తిని తెలిపారు. ఒక్కో మినీ కిట్‌లో 4 కిలోల విత్తనాలు ఉండగా, అది ఒక ఎకరం సాగుకు సరిపోతుంది. క్వింటాలుకు పూర్తి ధర రూ.13,000 కాగా, ప్రభుత్వం రూ.3,000 రాయితీ అందిస్తోంది. దీంతో రైతులు క్వింటాలుకు రూ.10,000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో 4 కిలోల మినీ కిట్ ధర రూ.400గా నిర్ణయించారు.

ఈ విత్తనాల పంపిణీలో చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు ప్రత్యేక కేటాయింపులు చేశారు. ఒక్కో రైతుకు ఒక మినీ కిట్ మాత్రమే అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి గల రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్ నకలుతో తలకొండపల్లి మండల వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని లేదా తమ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని సూచించారు. విత్తనాలు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉన్నందున ముందుగా వచ్చిన వారికి ముందు ప్రాధాన్యత ఆధారంగా పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. రైతులు వర్షాలు ప్రారంభం కాకముందే విత్తనాలు తీసుకుని సకాలంలో విత్తుకోవాలని మండల వ్యవసాయ అధికారి కోరారు.

Next Story