'పౌజీ'పై నాగ వంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఫ్యాన్స్‌లో పెరిగిన హైప్

by Pulgam srinivas |

'పౌజీ' ఫుటేజ్ చూసి ఫిదా అయినట్లు నాగ వంశీ చెప్పుకొచ్చాడు.

పౌజీపై నాగ వంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఫ్యాన్స్‌లో పెరిగిన హైప్
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన నిర్మాతల్లో సూర్యదేవర నాగ వంశీ ఒకరు. తాజాగా ఆయన అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన 'లెనిన్' చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నాగ వంశీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'పౌజీ' చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాగ వంశీ మాట్లాడుతూ... "ఇటీవల మైత్రి రవి గారు నాకు 'పౌజీ' చిత్రానికి సంబంధించిన కొంత ఫుటేజ్ చూపించారు.

ప్రేక్షకులు ఆ సినిమా గురించి ఏం ఊహించుకుంటున్నారో నాకు తెలియదు కానీ, వారు ఆ చిత్రాన్ని పూర్తిగా మరో స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఆ ఫుటేజ్ చూసిన తర్వాత ఈ సినిమా విడుదలైతే భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనే నమ్మకం కలిగింది" అని అన్నారు. నాగ వంశీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రభాస్ అభిమానుల్లో 'పౌజీ'పై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన యంగ్ బ్యూటీ ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

Next Story