- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భద్రాద్రి రామయ్య కల్యాణానికి అంకురార్పణ.. తలంబ్రాల వరి విత్తనాలకు శాస్త్రోక్తంగా పూజలు
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కల్యాణ తలంబ్రాల వరి విత్తనాలకు భక్త రామదాసు భక్తమండలి బృందం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అయోధ్యగా పేరుగాంచిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవ తలంబ్రాల తయారీకి అంకురార్పణ జరిగింది. స్వామివారి కల్యాణానికి ఉపయోగించే ప్రత్యేక తలంబ్రాల కోసం ఉద్దేశించిన వరి విత్తనాలకు ప్రధానాలయంల భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్త రామదాసు భక్తమండలి బృందం ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వరి విత్తనాలకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చేల్పూరు గ్రామానికి చెందిన భక్తులు ఈ పూజల్లో పాల్గొన్నారు. ఆలయంలో పూజలు పూర్తి చేసుకున్న ఈ పవిత్ర వరి విత్తనాలను చేల్పూరు గ్రామానికి తీసుకెళ్లి అక్కడ ప్రత్యేకంగా సాగు చేయనున్నారు. ఈ విత్తనాల ద్వారా పండించిన వడ్ల నుంచి భక్తులు ఎంతో నిష్ఠతో, చేతి గోళ్లతో ఒలిచి ‘కోటి గోటి తలంబ్రాలు’ తయారు చేస్తారు. ఇలా సిద్ధం చేసిన కోటి గోటి తలంబ్రాలనే వచ్చే శ్రీరామనవమి రోజున జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవానికి అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పిస్తారు.






