- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIRAL: మద్యం మత్తులో వింత దొంగతనం: పంచాయతీ ట్రాక్టర్‌ను ఎత్తుకెళ్లేందుకు యత్నం
మద్యం మత్తులో ఓ నలుగురు యువకులు ఏకంగా గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ను దొంగిలించేందుకు యత్నించారు.

దిశ, వెబ్‌డెస్క్: గ్రామాల్లో యువత పెడదోవ పడుతున్నారు. గంజాయి, మద్యానికి బానిసలై దొంగతనాలకు పాల్పడే స్థాయికి వచ్చేశారు. ప్రస్తుతం అచ్చం అలాంటి ఘటనే కామారెడ్డి (Kamareddy) జిల్లా భిక్కనూరు (Bhikkanoor) మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మేరకు.. పెద్ద మల్లారెడ్డి (Pedd Mallareddy) గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద సిబ్బంది ట్రాక్టర్‌ను పార్కింగ్ చేసి వెళ్లారు. అయితే, మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు ఆ ట్రాక్టర్‌ను దొంగతనం చేయడానికి ప్లాన్ చేశారు. అర్ధరాత్రి సమయంలో ట్రాక్టర్‌ను స్టార్ట్ చేసి ఎత్తుకెళ్లే క్రమంలో మందు కిక్కులో వాహనంపై నియంత్రణ కోల్పోయి పంచాయతీ ప్రహరీని బలంగా ఢీకొట్టారు.
ఈ ప్రమాదంలో ప్రహరీ భారీగా ధ్వంసమైంది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు, గ్రామస్తులు అలర్ట్ అయ్యారు. దొంగతనం చేస్తున్న నలుగురిలో ఓ యువకుడిని గ్రామస్తులు అక్కడికక్కడే పట్టుకున్నారు. అతడికి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించి ట్రాక్టర్‌కు కట్టేసి.. దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే మిగిలిన ముగ్గురు యువకులు చీకట్లోనే పరారయ్యారు. అయితే, యువకులు ట్రాక్టర్ దొంగతనం చేయడం, గోడను ఢీకొట్టిన దృశ్యాలన్నీ పంచాయతీ పరిధిలో ఉన్న సీసీ టీవీ (CCTV) కెమెరాలలో స్పష్టంగా రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.






